ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యం మెరుగుపరచాలి

ABN, First Publish Date - 2020-10-24T10:36:20+05:30

పద్మాపరం పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

పద్మాపురం సచివాలయం ఆకస్మిక తనిఖీ


అరకులోయ, అక్టోబరు 23: పద్మాపరం పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పద్మాపురం సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను నిశితంగా పరిశీలించి, ఆరా తీశారు.


అనంతరం పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శి హేమలతను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పన్నులను వసూలు చేయాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి పథకాలకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. కొవిడ్‌-19పై అప్రమత్తంగా ఉండాలని,  వైరస్‌ నిరోధానికి తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై మరో వారంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జీవీ రాంబాబు, తహసీల్దార్‌ శ్యాంప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - 2020-10-24T10:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising