నాడు-నేడు పనులు ఈనెల 14నాటికి పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2020-11-04T04:34:51+05:30
నాడు-నేడు పనులు ఈనెల 14నాటికి పూర్తి చేయాలి
టీడబ్ల్యూ డీడీ విజయ్‌కుమార్
చింతపల్లి, నవంబరు 3: ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు ఈనెల 14వ తేదీ నాటికి పూర్తిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల హెచ్‌ఎంలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలు పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. మరుగుదొడ్లు, మంచినీటి పథకాలు సత్వరంగా పూర్తిచేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు నాడు-నేడు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించేంది లేదన్నారు. ఈ సమావేశంలో ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు, స్థానిక హెచ్‌ఎం జేఏ కొండలరావు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
డౌనూరు ఆశ్రమ పాఠశాల తనిఖీ
కొయ్యూరు: మండలంలోని డౌనూరు బాలుర ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనులు, పాఠశాలలో పారిశుధ్య చర్యలు పరిశీలించారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావు, వార్డెన్ మల్లేశ్ ఉన్నారు.
Updated Date - 2020-11-04T04:34:51+05:30 IST