ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు రావాలి: గౌతమ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-02-20T08:35:04+05:30

విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు రావాలి: గౌతమ్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌నగర్‌, ఫిబ్రవరి 19: విశాఖలో మరిన్ని ఐటీ కంపెనీలు రావాలని రాష్ట్రపరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మిలీనియం టవర్స్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆయన బుధవారం ఐటీ కంపెనీల సీఈవోలతో  సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలతో పాటు మరిన్ని ఐటీ కంపెనీలు పెట్టాలన్నారు. మరిన్ని కంపెనీలు వస్తే 50 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అందుకు ఆయా శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీకి సంబంధించిన అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్‌, రహదారులు, వాటర్‌, రవాణా తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కళాశాల యాజమాన్యం తో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఐటీకి అవసరమైన కోర్సులు చెప్పాలని ఐటీ యాజమాన్యాన్ని కోరారు.అంతకు ముందు మిలీనియం టవర్స్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక్ర్టిక్‌ మోటారు సైకిళ్లను పరిశీలించారు. 

Updated Date - 2020-02-20T08:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising