ఒక్క చాన్స్‌తో అటకెక్కిన అభివృద్ధి
ABN, First Publish Date - 2020-12-30T05:21:42+05:30
రాష్ట్ర ప్రజలను ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా ఆటకెక్కించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ధ్వజం
వేపగుంట డిసెంబరు 29: రాష్ట్ర ప్రజలను ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా ఆటకెక్కించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. ప్రహ్లాదపురం సింహారద్రి ఆస్పత్రి వద్ద జీవీఎంసీ 93వ వార్డు బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం ఆ పార్టీ వార్డు అధ్యక్షుడు కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పలుగా ఉందన్నారు. ఈ నష్టం పూడ్చాలంటే మరో పదేళ్లు సక్రమంగా పాలన సాగిస్తే గానీ కోలుకోదని చెప్పారు. మధ్యతరగతి, సామాన్య ప్రజలను పన్నుపోటుకు గురిచేస్తున్నారన్నారు. ఇసుక కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇళ్లల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు రవీందర్, వెంకట సత్యనారాయణ, పార్టీ పెందుర్తి నియోజక వర్గ కన్వీనర్ మంగనాయుడు, ప్రకాశ్‌రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:21:42+05:30 IST