ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ వర్చువల్‌ సెమినార్‌కు గురుకుల విద్యార్థిని

ABN, First Publish Date - 2020-12-07T05:11:08+05:30

నగరంలోని కొమ్మాది రిక్షా కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కేఎల్‌ఎస్‌పీ వర్షిణి... స్వీడన్‌ ఎంబసి, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ సంయుక్తంగా ‘స్వీడన్‌ ఇండో మెమోరియల్‌ వారోత్సవాలు’ పేరిట సోమవారం నుంచి నిర్వహిస్తున్న ‘సైన్స్‌ ఆవిష్కరణలలో మహిళల పాత్ర’ అనే అంతర్జాతీయ వర్చువల్‌ సెమినార్‌కు భారతదేశం తరపున ఎంపికైంది.

కొవిడ్‌-19 మెసెంజర్‌ యాప్‌ను ప్రదర్శిస్తున్న వర్షిణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశం తరపున ఎంపికైన వర్షిణి

కొమ్మాది, డిసెంబరు 6: నగరంలోని కొమ్మాది రిక్షా కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కేఎల్‌ఎస్‌పీ వర్షిణి... స్వీడన్‌ ఎంబసి, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ సంయుక్తంగా ‘స్వీడన్‌ ఇండో మెమోరియల్‌ వారోత్సవాలు’ పేరిట సోమవారం నుంచి నిర్వహిస్తున్న ‘సైన్స్‌ ఆవిష్కరణలలో మహిళల పాత్ర’ అనే అంతర్జాతీయ వర్చువల్‌ సెమినార్‌కు భారతదేశం తరపున ఎంపికైంది. వర్షిణి గతంలో అటల్‌ టింకరింగ్‌ మారథాన్‌-2018 పేరిట నిర్వహించిన జాతీయస్థాయి ప్రదర్శనలో పాల్గొని టాప్‌-20 ప్రాజెక్టులలో ప్రథమ స్థానంలో నిలిచి రష్యాలోని సిరియాన్‌ సైన్స్‌ సెంటర్‌లో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో డిప్‌ టెక్నాలజీ, డ్రోన్‌ టెక్నాలజీలలో శిక్షణ పొందింది. అదేవిధంగా వర్షిణి ఇటీవల నీతి ఆయోగ్‌ పేరిట మన ప్రభుత్వం నిర్వహించిన అటల్‌ కమ్యూనిటీ చాలెంజ్‌-2020లో పాల్గొని కొవిడ్‌-19పై మెసెంజర్‌ యాప్‌ను రూపొందించి ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. వర్షిణి ప్రతిభను గుర్తించిన మన ప్రభుత్వం గురుకుల పాఠశాలల నుంచి అంతర్జాతీయ సెమినార్‌కు ఆమెను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.రూపవతి మాట్లాడుతూ భారతదేశం తరపున అంతర్జాతీయ వర్చువల్‌ సెమినార్‌కు వర్షిణి ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.  వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌వీ రమణ, సైన్స్‌ టీచర్‌ టి.రాంబాబు, ఉపాధ్యాయులు గణేశ్‌పాత్రో, అప్పలనాయడు, మూర్తి, తదితరులు వర్షిణికి అభినందించారు.



Updated Date - 2020-12-07T05:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising