ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుత్తులపుట్టును మండల కేంద్రంగా ఏర్పాటుచేయాలి

ABN, First Publish Date - 2020-12-04T05:37:17+05:30

మండలంలో గుత్తులపుట్టు మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వివిధ పంచాయతీల ప్రజలతో మండల సాధన కమిటీ నాయకులు గురువారం వారపు సంతలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.

గిరిజనులతో ర్యాలీ నిర్వహిస్తున్న సాధన కమిటీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరురూరల్‌/పెదబయలు, డిసెంబరు 3: మండలంలో గుత్తులపుట్టు మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వివిధ పంచాయతీల ప్రజలతో మండల సాధన కమిటీ నాయకులు గురువారం వారపు సంతలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన కమిటీ నాయకుడు సూరిబాబు మాట్లాడుతూ..పాడేరు మండలంలోని గుత్తులపుట్టు, జి.ముంచంగిపుట్టు, కించూరు, ఇరడాపల్లి, గబ్బంగి పంచాయతీలతోపాటు పెదబయలు మండలంలోని కుంతుర్ల, కిముడుపల్లి, పెదకోడాపల్లి, గంపరాయి పంచాయతీలను కలిపి గుత్తులపుట్టు మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ నాయకులు వి.రామన్న, కె.సింహాచలం, ప్రసాద్‌, నాగేశ్వరరావు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మద్దిగరువు మండల సాధన కమిటీ నాయకుల ఆధ్వర్యంలో పది పంచాయతీల ప్రజలు గురువారం మద్దిగరువు వారపు సంతలో ర్యాలీ చేపట్టారు. 

 

Updated Date - 2020-12-04T05:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising