ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవరపాలెంలో తుపాకుల కలకలం

ABN, First Publish Date - 2020-12-05T06:02:32+05:30

గవరపాలెం ఎన్టీఆర్‌ కాలనీలో తుపాకులు బయటపడిన వ్యవహారం కలకలం రేపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నివాసంలో రెండు తుపాకులు (పిస్టళ్లు), 18 బులెట్లు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతి చెందిన వ్యక్తి ఇంట్లో రెండు తుపాకులు, 18 బులెట్లు

విచారణ చేపడుతున్న పోలీసులు


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 4: గవరపాలెం ఎన్టీఆర్‌ కాలనీలో తుపాకులు బయటపడిన వ్యవహారం కలకలం రేపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నివాసంలో రెండు తుపాకులు (పిస్టళ్లు), 18 బులెట్లు లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎబ్రాడ్‌లో క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన భీశెట్టి లోకనాథరావు 2015 నుంచి అనకాపల్లిలోని తన నివాసంలో ఉంటున్నాడు. ఆయన మద్యానికి అలవాటుపడి  కుటుంబ సభ్యులతో సరిగా ఉండకపోవడంతో భార్య కొంతకాలం నుంచి వేరుగా జీవిస్తున్నారు. ఒంటరితనంతో మనస్తాపానికి గురైన లోకనాథరావు గత నెల 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ 27న మృతి చెందారు.

ఇదిలా ఉండగా లోకనాథరావు ఇంటిని అతని కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం శుభ్రం చేస్తుండగా రెండు దేశవాళీ తుపాకులు, 18 బులెట్లు కనిపించాయి. దీంతో మృతుని మావయ్య కర్రి శ్రీనివాసరావు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్‌ లేకుండా తుపాకులు కలిగి ఉండడంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపారు.

Updated Date - 2020-12-05T06:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising