గ్రేహౌండ్స్ భూములు పరిశీలన
ABN, First Publish Date - 2020-12-31T05:05:36+05:30
మండలంలోని చందక పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన భూములను బుధవారం రాష్ట్ర భూపరిపాలనా ప్రధానాధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ పరిశీలించారు.
ఆనందపురం, డిసెంబరు 30: మండలంలోని చందక పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన భూములను బుధవారం రాష్ట్ర భూపరిపాలనా ప్రధానాధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ పరిశీలించారు. జగన్నాథపురం సర్వే నంబర్ -1లో 385 ఎకరాల భూమిని గ్రేహౌండ్స్ ఏర్పాటుకు కేటాయించారు. ఈ సందర్భంగా నీరబ్‌కుమార్ ప్రసాద్ ఈ స్థలాన్ని సందర్శించి, వివరాలలు అడిగి తెలుసుకున్నారు. మ్యాప్ ద్వారా భూ స్వరూపాన్ని నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ భూమి ఎంత, డి-ఫామ్ పట్టా ఎంత ఉందనే వివరాలను తహసీల్దార్ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ భూముల సంరక్షణపై పలు సూచనలు, సలహాలను అధికారులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీవో పెంచల కిశోర్‌బాబు, ఆర్‌ఐ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-31T05:05:36+05:30 IST