ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంకర కైంకర్యం

ABN, First Publish Date - 2020-11-25T04:21:45+05:30

మండలంలోని అసకపల్లి సర్వే నంబరు- 1 కొండ నుంచి విలువైన గ్రావెల్‌ తరలిపోతోంది. శని, ఆదివారాల్లో లోడులకు లోడులు తవ్వుకుపోతున్నారు.

అసకపల్లి సర్వే నంబరు- 1లో గ్రావెల్‌ తరలించుకుపోవడంతో ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీగా గ్రావెల్‌ తరలించుకుపోతున్న అక్రమార్కులు

చోద్యం చూస్తున్న గనుల శాఖ అధికారులు


సబ్బవరం, నవంబరు 24 : మండలంలోని అసకపల్లి సర్వే నంబరు- 1 కొండ నుంచి విలువైన గ్రావెల్‌ తరలిపోతోంది. శని, ఆదివారాల్లో లోడులకు లోడులు తవ్వుకుపోతున్నారు. ఈ విషయం తెలిసినా గనుల శాఖ అధికా రులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబ్బవరం మండలంలో గ్రావెల్‌కు మంచి గిరాకీ ఉండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. లే అవుట్లు ఎక్కువగా అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ గ్రావెల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడి గ్రావెల్‌ మంచి నాణ్యతతో కూడా ఉండడం వల్ల అక్రమార్కుల పంట పండింది. అసకపల్లి సర్వే నంబరు-1 కొండ సబ్బవరానికి కూతవేటు దూరంలో ఉంది. గ్రావెల్‌ తరలించుకుపోతున్న క్వారీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి ఆనుకుని ఉండడం గమనార్హం. గతంలో ఈ కొండకు గ్రావెల్‌ పర్మిషన్‌ పెట్టుకున్న పలు దరఖాస్తులను గ్రీన్‌ బెల్ట్‌ పరిధిలో ఉందని గనుల శాఖ, రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. అయితే గ్రీన్‌ బెల్ట్‌ పరిధిలో ఉన్నప్పటికీ అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ రమాదేవిని వివరణ కోరగా సిబ్బంది సర్వే పనుల్లో బిజీగా ఉండడంతో అక్రమార్కులు రాత్రి సమయాల్లో తెగబడుతున్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.


Updated Date - 2020-11-25T04:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising