ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి దశలవారీగా తరగతులు

ABN, First Publish Date - 2020-11-22T05:10:11+05:30

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా తరగతులను పునఃప్రారంభిస్తామని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గీతం’ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ

సాగర్‌నగర్‌, నవంబరు 21: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా తరగతులను పునఃప్రారంభిస్తామని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో  తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులను దశలవారీగా తరగతులకు అనుమతిస్తామన్నారు. సోమవారం నుంచి నుంచి బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు యథావిధిగా హాజరవుతారని, 30వ తేదీ నుంచి ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎం.ఫార్మశీ, ఎమ్‌.ఆర్క్‌ తదితర పీజీ కోర్సుల విద్యార్థులు తరగతులు, ప్రయోగశాలలు, ప్రాజెక్టు వర్క్‌లకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన విద్యార్థులు జనవరి 18 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులకు హాజరవుతారన్నారు. హాస్టళ్లు, తరగతి గదులు, ప్రయోగశాలలను శానిటైజేషన్‌ చేయడంతో పాటు విద్యార్థులకు, సిబ్బందికి సేవలందించేందుకు ప్రత్యేక కమిటీలను అందుబాటులో ఉంచుతామని రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-22T05:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising