ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదోసారి ఉచిత బియ్యం

ABN, First Publish Date - 2020-05-28T09:48:55+05:30

తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఈ నెల 29వ తేదీ నుంచి ఐదో విడత ఉచితంగా బియ్యం, కందిపప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కిలో కంది పప్పు కూడా....
  • రేపటి నుంచి రేషన్‌ డిపోల్లో పంపిణీ

విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఈ నెల 29వ తేదీ నుంచి ఐదో విడత ఉచితంగా బియ్యం, కందిపప్పు అందజేయనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆయా రేషన్‌ డిపోల్లో పంపిణీ చేస్తారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి తెల్ల రేషన్‌ కార్డుదారులకు నెలలో రెండు పర్యాయాలు ఉచితంగా బియ్యం, కందిపప్పు/శనగలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది. తొలిసారి మార్చి 29న పంపిణీని ప్రారంభించారు. తరువాత 15 రోజులకోసారి...ఇప్పటివరకు నాలుగు విడతలు ఉచిత రేషన్‌  అందజేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఐదో విడత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా వైరస్‌, భౌతిక దూరం నేపథ్యంలో రేషన్‌ డిపోల వద్ద రద్దీని నివారించడానికి కార్డుదారులకు ఒకరోజు ముందుగానే కూపన్లు పంపిణీ చేయనున్నారు. కూపన్లలో పేర్కొన్న తేదీన కార్డుదారులు రేషన్‌ దుకాణానికి వెళ్లి సరకులు తీసుకోవాలని, వచ్చే నెల 12వ తేదీ వరకు పొందవచ్చని పౌరసరఫరాల అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-28T09:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising