ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్మా ఉద్యోగి.. ఆఫీసు బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం.. చివరకు..

ABN, First Publish Date - 2020-08-01T19:01:09+05:30

వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఫార్మా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫార్మా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం


పరవాడ(విశాఖ): వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఫార్మా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...విజయనగరం జిల్లా బలిజపేట మండలం పరగాం గ్రామానికి చెందిన  జి.గౌరీశంక్‌(29) విజయశ్రీ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో జూనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం విధులకు హాజరైన అతను మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఐపీఏ ద్రావణం తాగి అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. తోటి ఉద్యోగులు గమనించి అతనిని విశాఖ విమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరీ శంకర్‌ కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. సీఐ ఉదయ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. యాజమాన్యం పని భారం కారణంగానే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-01T19:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising