ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చవితి ఉత్సవాలకు..కొవిడ్‌ నిబంధనలు

ABN, First Publish Date - 2020-08-14T11:35:53+05:30

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసు శాఖ పలు ఆంక్షలు, నిబంధనలు విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామం అంతటికీ ఒక్క విగ్రహమే పెట్టాలి

నాలుగు అడుగులకు మించకూడదు

మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి

మండపాల వద్ద తీర్థప్రసాదాలు బంద్‌

సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులపై నిషేధం

ఐదు రోజుల్లోనే నిమజ్జనం ప్రక్రియ పూర్తి


కొయ్యూరు, ఆగస్టు 13: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసు శాఖ పలు ఆంక్షలు, నిబంధనలు విధించింది. గతంలో మాదిరిగా వీధికో మండపం ఏర్పాటుచేయడానికి వీలులేదు. గ్రామం మొత్తానికి కలిపి ఒకే ఒక్క వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి. ఈ మేరకు నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాలు జారీచేసినట్టు కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ఇంకా ఏయే నిబంధనలు వున్నాయంటే...ఉత్సవాలకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి. ఎత్తు నాలుగు అడుగులకు మించకూడదు. మండపాల వద్ద ఎటువంటి సౌండ్‌ సిస్టం బాక్సులు పెట్టకూడదు. మండపాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు వంటివి పంపిణీ చేయడానికి వీలులేదు. సాంస్కృతిక కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ఠ/నిమజ్జన సమయాల్లో ఊరేగింపులు నిషేధం. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు రోజుల్లోగా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. వీటిల్లో ఏ ఒక్కదానిని అతిక్రమించినా కొవిడ్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. 

Updated Date - 2020-08-14T11:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising