ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయితీ ఉల్లి కోసం..

ABN, First Publish Date - 2020-10-24T10:41:42+05:30

: రైతుబజార్లలో రాయితీ ఉల్లి (కిలో రూ.40) అమ్మకాలు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రైతుబజార్లలోబారులుతీరిన జనం

 కిలో రూ.40 చొప్పున విక్రయాలు


విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతుబజార్లలో రాయితీ ఉల్లి (కిలో రూ.40) అమ్మకాలు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించారు. ఒక్కొక్కరికి కిలో మాత్రమే ఇచ్చారు. పేరు, ఫోన్‌ నంబర్‌ రాసుకుంటున్నారు. రాయితీ ఉల్లి కొనుగోలుకు వినియోగదారులు బారులుతీరారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మకాలు జరిగాయి. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార రైతుబజార్లలో సాయంత్రం కూడా విక్రయించారు. కొన్ని బజార్లలో 30 నుంచి 50 బస్తాల వరకు ఉల్లి మిగిలింది. వాటిని శనివారం ఉదయం రాయితీ ధరకు విక్రయిస్తారు.


శని, ఆదివారాల్లో రాయితీ ఉల్లి వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రెండు రోజులు డ్వాక్రా సంఘాలు అమ్మే రేటు (కిలో రూ.74)కు కొనుగోలు చేసుకోవలసి ఉంటుంది. దసరా మరుసటి రోజు అంటే సోమవారం నాటికి రాయితీ ఉల్లి వస్తుందని, అప్పుడు మళ్లీ రేటు తగ్గించి రాయితీపై విక్రయిస్తామని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో రూ.90-రూ.100 మధ్య విక్రయిస్తున్నారు.

Updated Date - 2020-10-24T10:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising