ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారులు చైతన్యవంతులవ్వాలి

ABN, First Publish Date - 2020-11-22T05:19:58+05:30

మత్స్యకారులు రాజకీయంగా చైతన్యవంతులైనప్పుడే సమస్యలను పరిష్కరించుకోగలమని మండల మత్స్యకార నాయకుడు, మూడో వార్డు వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి దౌలపల్లి ఏడుకొండలరావు అన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న దౌలపల్లి ఏడుకొండలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల మత్స్యకార నాయకుడు ఏడుకొండలరావు

భీమునిపట్నం, నవంబరు 21: మత్స్యకారులు రాజకీయంగా చైతన్యవంతులైనప్పుడే సమస్యలను పరిష్కరించుకోగలమని మండల మత్స్యకార నాయకుడు, మూడో వార్డు వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి దౌలపల్లి ఏడుకొండలరావు అన్నారు. శనివారం చేపలుప్పాడలో ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మత్స్యకారులంతా తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో చేర్పించి విద్యావంతులను చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు చొక్కా భాస్కరరావు మాట్లాడుతూ తమను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులంతా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కారి అప్పారావు, దౌలపల్లి దాసు, వాసుపల్లి ఎల్లారావు, కురందాసు ముల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. ముందుగా దివంగత మాజీ కార్పొరేటర్‌ నీలకంఠానికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. 


‘మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలి’

సిరిపురం: మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలంటే వారిని ఎస్టీ జాబితాలో చేర్చడమే శరణ్యమని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల ఐక్యవేదిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఒలిశెట్టి గురునాథ్‌, గరికిన రవి, ప్రతాప్‌, వేగి వెంకటేషు, శివ, రాజేష్‌, గంటా నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.


మత్స్యకారుల సంక్షేమానికి వాసుపల్లి కృషి

సిరిపురం: మత్స్యకారుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని వైసీపీ మాజీ యువజన అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వాసుపల్లిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T05:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising