ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములిచ్చిన రైతులకు మెరుగైన పరిహారం

ABN, First Publish Date - 2020-12-05T03:59:47+05:30

విశాఖపట్నం- రాయపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లిస్తామని డిప్యూటీ తహసీల్దార్‌ రాజావిక్రమ్‌ తెలిపారు.

భూములు పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ తహసీల్దార్‌ రాజావిక్రమ్‌


సబ్బవరం, డిసెంబరు 4 : విశాఖపట్నం- రాయపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లిస్తామని డిప్యూటీ తహసీల్దార్‌ రాజావిక్రమ్‌ తెలిపారు. ఎస్‌డీసీ సూర్యకళ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని మొగలిపురంలో జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తుగా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి ఏ సర్వే నంబర్లో ఏ రైతు ఉన్నది, ఆ భూములు ఏ పంటలు సాగు చేస్తున్నారు?, బోర్లు ఉన్నాయా?, బావులు ఉన్నాయా? అని గుర్తించి, ఏ రైతుకు ఎంత భూమి పోతుందో అంచనా వేస్తామన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ భూములు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే భూ రికార్డులు సక్రమంగా లేవని, వీటిని సరి చేసి మెరుగైన పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సబ్బవరం మండలంలో సబ్బవరం, గుల్లేపల్లి, మొగలిపురం రెవెన్యూ గ్రామాల్లో హైవే కోసం భూములు సేకరిస్తున్నట్టు డీటీ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమాదేవి, ఆర్‌ఐ సుధాకర్‌, వీఆర్వో జ్యోతి, పలువురు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T03:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising