ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరు
ABN, First Publish Date - 2020-12-29T05:46:48+05:30
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల కూడా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజ గదీశ్వరరావు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఆరోపించారు.
ఎమ్మెల్సీలు నాగజగదీశ్వరరావు, చలపతిరావు
మునగపాక, డిసెంబరు 28 : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల కూడా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజ గదీశ్వరరావు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఆరోపించారు. గతంలో అప్పుల బాధ తాళలేక వాడ్రాపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కాండ్రేగుల వీరునాయుడు, కూలి పనికి వెళ్లి కాలువలో పడి అతని కుమారుడు కారునాయుడు మరణించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహా యం అందలేదన్నారు. మృతుడు వీరునాయుడు భార్య భూలక్ష్మి, కుమారుడు నాగేశ్వరరావులను సోమవారం వారు పరామర్శించి, అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదన్నారు. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆడారి మంజు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు, మాజీ సర్పంచ్ యర్రయ్య, మళ్ల వరహా నరసింగరావు, మొల్లేటి సత్యనారాయణ, కాండ్రేగుల నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.
==
కౌలురైతు కుటుంబానికి పరామర్శ
రాంబిల్లి : వ్యవసాయం కలిసి రాక, చేసిన అప్పలు తీర్చలేక అత్మహత్య చేసుకున్న దిమిలి గ్రామానికి చెందిన కౌలు రైతు గెదెలే శ్రీనివాసరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు వి.దిన్‌బాబు సోమవారం పరామర్శించారు. అన్ని విధాలా బాసటా నిలుస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T05:46:48+05:30 IST