ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల కోసం మా భూములు లాక్కోవద్దు

ABN, First Publish Date - 2020-12-06T04:10:37+05:30

ఇళ్ల స్థలాల కోసం తమకు ఏకైక ఆధారమైన భూములను లాక్కోవద్దని మండలంలోని గాలిభీమవరం శివారు పల్లవానిపాలెం రైతులు శనివారం తహసీల్దార్‌ రమాదేవి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

తహసీల్దార్‌ను కలిసేందుకు వచ్చిన పల్లవానిపాలెం రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లవానిపాలెం రైతుల వేడుకోలు


సబ్బవరం, డిసెంబరు 5 : ఇళ్ల స్థలాల కోసం తమకు ఏకైక ఆధారమైన భూములను లాక్కోవద్దని మండలంలోని గాలిభీమవరం శివారు పల్లవానిపాలెం రైతులు శనివారం తహసీల్దార్‌ రమాదేవి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్ల వెంకటేశ్‌, సింహాచలం, పెంటయ్య, సీతమ్మ, ముసిలినాయుడు, కన్నయ్యతో పాటు మరో 20 మంది రైతులు ఆమెకు కలిసి తమ గోడు వెలిబుచ్చారు. గ్రామం సర్వే నంబరు 64లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటూ, వృత్తి రీత్యా పశువులు, మేకలు, గొర్రెలు కాసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తమ భూములను ఇళ్ల స్థలాల కోసం లాక్కుంటే రోడ్డున పడతామని వాపోయారు. ఇళ్ల స్థలాల కోసం వేరే చోట స్థలం ఏర్పాటు చేసి తమ భూములు తమకు విడిచిపెట్టాలని కోరారు. దీనిపై తహసీల్దార్‌ రమాదేవి స్పందిస్తూ గ్రామంలో 40 మందికి ఇళ్ల స్థలాలను ఆ సర్వే నంబరులో కేటాయించామన్నారు. అయితే రైతుల అభ్యర్థన మేరకు ప్రత్యామ్నాయంగా గ్రామానికి ఆనుకుని ఉన్న స్థలం పరిశీలిస్తామన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-12-06T04:10:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising