ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంకీ, ఫార్మా యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

ABN, First Publish Date - 2020-11-04T02:20:04+05:30

రాంకీ సంస్థ, ఫార్మా కంపెనీల యాజమాన్యాల నిర్వాకం వల్లే పెద్ద చెరువు, ఊర చెరువు కలుషితమయ్యాయలని, తక్షణమే ఆయా యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయా చెరువుల ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేశారు.

సీఐ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు పత్రం అందజేస్తున్న ఆయకట్టు రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐకి ఆయకట్టు రైతుల ఫిర్యాదు

పరవాడ, నవంబరు 3: రాంకీ సంస్థ, ఫార్మా కంపెనీల యాజమాన్యాల నిర్వాకం వల్లే పెద్ద చెరువు, ఊర చెరువు కలుషితమయ్యాయలని, తక్షణమే ఆయా యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయా చెరువుల ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతులు పైలా రామచంద్రరావు, చుక్క సన్యాసిరావవు, పైలా హరీశ్‌లు మంగళవారం పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫార్మా వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా నేరుగా విడిచిపెట్టడం వల్ల చెరువుల్లో నీరు కలుషితమవుతోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యర్థ జలాల కారణంగానే పెద్ద చెరువులో 25 లక్షల విలువైన చేపలు ఇటీవల చనిపోయాయని తెలిపారు. ఫార్మా వ్యర్థ రసాయనాల కారణంగా ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని తక్షణమే రాంకీ, ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలని సీఐ ఉమామహేశ్వరరావును కోరారు. 

Updated Date - 2020-11-04T02:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising