ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్ద చెరువు ఆయకట్టు రైతుల రిలే దీక్షలు

ABN, First Publish Date - 2020-10-31T23:57:14+05:30

పరవాడ పెద్ద చెరువు ఆయకట్టు రైతులు శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఫార్మా వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా గెడ్డల్లో విడిచిపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ, ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పెద్ద చెరువు ఆయకట్టు రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంకీ, ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై చర్యలకు డిమాండ్‌

పరవాడ, అక్టోబరు 31: పరవాడ పెద్ద చెరువు ఆయకట్టు రైతులు శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఫార్మా వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా గెడ్డల్లో విడిచిపెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాంకీ, ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. రాంకీ ఫార్మాసిటీ వ్యర్థ జలాలు పెద్ద చెరువులో కలవడంతో శుక్రవారం భారీ సంఖ్యలో చేపలు చనిపోయిన విషయం తెలిసిందే.  ఈ చర్యను నిరసిస్తూ ఆయకట్టు రైతులంతా చెరువు గట్టు వద్ద రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాంకీ, ఫార్మా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఏళ్ల తరబడి పరవాడ ప్రాంత ప్రజలు ఫార్మా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు రైతులంతా రాంకీ, ఫార్మా యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద చెరువు ఆయకట్టు దారుల సంఘం అధ్యక్షుడు పైలా రామచంద్రరావు, రెడ్డి శ్రీనివాసరావు, చీపురుపల్లి సన్యాసిరావు, మాజీ సర్పంచ్‌ చుక్క రామునాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శిరపురపు అప్పలనాయుడు, చుక్క సన్యాసిరావు, పైలా సత్య్గనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T23:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising