ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాటలివీ..

ABN, First Publish Date - 2020-07-14T13:01:44+05:30

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షితో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాట్లాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షితో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మాట్లాడింది. ఈ సందర్భంగా అసలు ఏం జరిగింది..? అనే విషయాన్ని నిశితంగా ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇదే కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి అన్‌లోడింగ్ మొదలుపెట్టారు. అయితే ఇంకా మిగిలిపోయే సరికి ఉదయం చేద్దాం అని చెప్పి పని ఆపేసి అందరం తిని పడుకున్నాం. 10:30, 11 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దాలు వచ్చాయి. ఏం జరిగిందా అని బయటికి వచ్చి చూస్తే పెద్ద ఎత్తున మంటలు, శబ్దాలు వస్తున్నాయ్. గేట్‌కు తాళం వేసి ఉండటంతో బయటికి రావడానికి వీలు కాలేదు. గేట్ పై నుంచి దూకి బయటికొచ్చేశాను. వెంటనే వేరొకరితో ఫోన్ తీసుకుని మా ఓనర్‌కు సమాచారం ఇచ్చాను. అయితే ఎంత మంది గాయపడ్డారు.. ఎంత మంది విధుల్లో ఉన్నారు అనేది తెలియట్లేదు అని డ్రైవర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు.

Updated Date - 2020-07-14T13:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising