ఉత్సాహంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
ABN, First Publish Date - 2020-12-21T04:30:30+05:30
పట్టణంలోని శ్రీరామదేవా జిమ్ వద్ద వేల్పులవీధి యూత్, వైసీపీ నేత కాండ్రేగుల చందు ఆధ్వర్యంలో ఆదివారం 52వ పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు.
నెహ్రూచౌక్, డిసెంబరు 20: పట్టణంలోని శ్రీరామదేవా జిమ్ వద్ద వేల్పులవీధి యూత్, వైసీపీ నేత కాండ్రేగుల చందు ఆధ్వర్యంలో ఆదివారం 52వ పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్, డాక్టర్ విష్ణుమూర్తి హాజరయ్యారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. పోటీల్లో 158 మంది పవర్ లిఫ్టర్లు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శంకరరావు, కార్యదర్శి ఎం.భాస్కర్, గుండ్రపు నీల, శ్రీనివాసరావు, జిమ్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-21T04:30:30+05:30 IST