గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2020-11-14T04:19:54+05:30
గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు.
టీడీపీ నిరసనలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండు
పాడేరురూరల్(జి.మాడుగుల), నవంబరు 13: గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శుక్రవారం టీడీపీ మండల సమావేశం అనంతరం జి.మాడుగులలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల సమస్యలు పట్టడం లేదన్నారు. గిరిజన రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని, వృద్ధుల పింఛన్ రూ.మూడు వేలు ఇవ్వాలని, యువతకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమెలి చిట్టిబాబు, నాగబ్బాయి, శాంతికుమారి, ఈశ్వరరావు, కల్యాణం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T04:19:54+05:30 IST