ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రానైట్‌ పలకల తరలింపుపై విచారణ

ABN, First Publish Date - 2020-12-05T04:52:44+05:30

మండలంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాల నుంచి గ్రానైట్‌ పలకలు తరలింపు అంశంపై ఎస్‌ఐ నారాయణరావు శుక్రవారం విచారణ జరి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇన్‌చార్జి ఎంఈవో, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌కు చెప్పే పలకలు విక్రయం

  ఎస్‌ఐకు వివరించిన జోగంపేట పాఠశాల హెచ్‌ఎం

 తమపై తప్పుడు సమాచారం ఇచ్చారన్న  చైర్మన్‌ 

గొలుగొండ, డిసెంబరు 4 : మండలంలోని జోగంపేట ప్రాథమిక పాఠశాల నుంచి గ్రానైట్‌ పలకలు తరలింపు అంశంపై ఎస్‌ఐ నారాయణరావు శుక్రవారం విచారణ జరి పారు. పలకల తరలిస్తుండగా, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ వరహాబాబు ఆధ్వర్యంలో పలు వురు గ్రామస్థులు గురువారం సాయంత్రం అడ్డుకున్న విష యం తెలిసిందే. దీనిపై పాఠశాల హెచ్‌ఎం మృదుభాషిని, ఇన్‌చార్జి ఎంఈవో అమృత్‌కుమార్‌, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, గ్రానైట్‌ పలకలు కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ విచారించారు. నాడు- నేడులో భాగంగా పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.18 లక్షలు మంజూరు చేయగా, పనులకు పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ తమకు సహకరిం చలేదని  ఎస్‌ఐకు  హెచ్‌ఎం వివరించారు. తొలుత ఆరు తరగతి గదులకు గ్రానైట్‌ పలకలు ఏర్పాటు నిమిత్తం నాలుగు వేల అడుగుల పలకలు కొనుగోలు చేశామని, అయితే నాలుగు తరగతి గదులకు మాత్రమే మరమ్మతులు అవసమరమని గుర్తించి రెండు వేల అడుగుల గ్రానైట్‌ పలకలు మాత్రమే వినియోగించామని విచారణలో హెచ్‌ఎం చెప్పారు. మిగిలిన పలకలు విక్రయించినట్లు హెచ్‌ఎం తెలిపినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఇన్‌చార్జి ఎంఈవో, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌కు సమాచారం అందించే పలకలు విక్రయిచించామని హెచ్‌ఎం వివరించారన్నారు.  ఇదిలావుంటే, తమపై హెచ్‌ఎం తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ తెలిపినట్లు ఎస్‌ఐ చెప్పారు.  మిగిలిన గ్రానైట్‌ పలకలు ఇన్‌చార్జి ఎంఈవో అనుమతులతోనే తరలించామని గ్రానైట్‌ కొనుగోలుదారుడు తెలిపారని ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు. ఇదిలా వుంటే, ఎంఈవో అమృత్‌కుమార్‌ కూడా పాఠశాలలో ఈ అం శంపై విచారణ జరిపారు. పూర్తి వివరాలను ఉన్నతాధికా రులకు నివేదిస్తామన్నారు.

Updated Date - 2020-12-05T04:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising