ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిక్షణతో అర్చకులలో మరింత నైపుణ్యం

ABN, First Publish Date - 2020-12-11T05:25:38+05:30

గిరిజన ప్రాంతంలోని దేవాలయాల అర్చకులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అర్చక అకాడమీ నిర్వహించిన శిక్షణ దోహదపడుతుందని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి అన్నారు.

అర్చకులకు ధ్రువపత్రాలు అందిస్తున్న దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి

విజయవంతంగా ముగిసిన అర్చకుల శిక్షణ


పాడేరురూరల్‌, డిసెంబరు 10: గిరిజన ప్రాంతంలోని దేవాలయాల అర్చకులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అర్చక అకాడమీ నిర్వహించిన శిక్షణ దోహదపడుతుందని దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికుమారి అన్నారు. గురువారం సూకురుపుట్టులో అర్చక శిక్షణ పొందిన అర్చకులకు ఆమె ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంత అర్చకులు నియమ నిష్టలతో పూజలు చేయాలన్నారు. మన్యంలోని 130 మంది గిరిజన అర్చకులకు అర్చక అకాడమీ డైరెక్టర్‌ ఎ.కృష్ణశర్మ, శారదాపీఠం ఆస్థాన పండితులు రఘునారాయణ దీక్షితులు నిత్యపూజా విధి విధానాలు, శుభముహ్తూలు, తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. అనంతరం అర్చకులు సూకురుపుట్టు నుంచి పాడేరు వరకు వానగిరి సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి శ్రీధర్‌ బుజ్జిబాబు, విశ్వనాథ్‌, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు కూడా రామకృష్ణ పరమహంస పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising