ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడ్‌సెట్‌-20లో సత్తాచాటారు

ABN, First Publish Date - 2020-10-25T10:29:33+05:30

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌-20 ఫలితాలు విడుదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు

ఫిజికల్‌ సైన్స్‌లో షీలానగర్‌కు చెందిన పాతిమాకు మొదటి ర్యాంకు


విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌-20 ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో  నగరంలోని షీలానగర్‌కు చెందిన ఫాతిమా షఫానా ఏఆర్‌ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. అదే విధంగా మ్యాథమెటిక్స్‌ విభాగంలో విశాలాక్షి నగర్‌కు చెందిన భాగవతుల వీఎం ఉషాకిరణ్‌వర్మ రెండో ర్యాంకు, ఇదే విభాగంలో ఏన్‌ఏడీ ప్రాంతానికి చెందిన మజ్జి కవిత ఏడో ర్యాంకు, నర్సీపట్నానికి చెందిన బంటు ఆదిలక్ష్మి ఎనిమిదో ర్యాంకు, ఫిజికల్‌ సైన్స్‌ విభాగంలో అగనంపూడికి చెందిన నిర్మలాదేవి దనభాల నాలుగో ర్యాంకు, సీతమ్మధారకు చెందిన అనిల్‌కుమార్‌ పరిటాల తొమ్మిదో ర్యాంకు, సీతమ్మధారకు చెందిన హేమలత సిరసవల్లి పదో ర్యాంకు, బయోలాజికల్‌ సైన్స్‌ విభాగంలో పాత గాజువాకకు చెందిన యామిని రెడ్డిపల్లి నాలుగో ర్యాంకు, సోషల్‌ స్టడీస్‌ విభాగంలో చినముషిడివాడకు చెందిన మరుపల్లి రమేష్‌ ఎనిమిదో ర్యాంకు, ఇంగ్లీష్‌ విభాగంలో దొండపర్తి ప్రాంతానికి చెందిన గిరీష్‌ బడిరెడ్డి మూడో ర్యాంకు, సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఓలివియ మతి తొమ్మిదో ర్యాంకు సాధించారు. వీరి తోపాటు పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించారు. 

Updated Date - 2020-10-25T10:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising