మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
ABN, First Publish Date - 2020-12-06T06:15:20+05:30
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.
చింతపల్లిలో కురుస్తున్న మంచు
చింతపల్లిలో 11.8 డిగ్రీలు నమోదు
చింతపల్లి, డిసెంబరు 5: మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో చలి మళ్లీ పెరిగింది. శనివారం చింతపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తున్నది. ఏజెన్సీవాసులు ఉన్నిదుస్తులు 24గంటలు ధరించుకుంటున్నారు.
Updated Date - 2020-12-06T06:15:20+05:30 IST