ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భం వస్తుందేమోనన్న భయంతో ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-05-29T18:46:03+05:30

తోటి విద్యార్థితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైన ఏడో తరగతి విద్యార్థిని గర్భం వస్తుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం (విశాఖపట్టణం): తోటి విద్యార్థితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైన ఏడో తరగతి విద్యార్థిని గర్భం వస్తుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాఠశాలలో తనతో చదువుకున్న బాలుడితో ఆ బాలిక (14) ప్రేమలో పడింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అయితే గర్భం వస్తుందేమోనని ఆ బాలిక ఆందోళన చెందింది. గురువారం తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో చీరతో ఫ్యాన్‌ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా ఉంది. వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందిన సమాచారం మేరకు మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ మహాలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతిపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని కేజీహెచ్‌కి తరలించారు. ఈ ఘటనకు కారకుడిగా భావిస్తున్న బాలుడిని స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. ఈ కేసును మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఉదయ్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-29T18:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising