స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అయినా తప్పని డోలిమోతలు
ABN, First Publish Date - 2020-11-04T04:32:16+05:30
స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడిచినా ఇప్పటికీ గిరిజన రోగులకు డోలి మోత కష్టాలు తప్పడం లేదు. తలనొప్పి వచ్చినా.. జ్వరం వచ్చినా.. వైద్యం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న గిరిజనులు
చీడికాడ: స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడిచినా ఇప్పటికీ గిరిజన రోగులకు డోలి మోత కష్టాలు తప్పడం లేదు. తలనొప్పి వచ్చినా.. జ్వరం వచ్చినా.. వైద్యం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కోనాం సమీపంలోని పాడేరు మండలం సలుగు పంచాయతీ డిప్పగరువు గిరిజన గ్రామానికి చెందిన డిప్పల జమ్ములు అనారోగ్యానికి గురయ్యాడు. ప్రభుత్వ వైద్యం అందని ఆ రోగిని చోడవరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు డిప్పగరువు నుంచి తుప్పలు, గెడ్డలు దాటుకొని గ్రామస్థులు డోలిమోతతో కుసర్లపాలెం తీసుకువచ్చి, అక్కడి నుంచి చోడవరం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించామని జమ్ములు కుటుంబ సభ్యులు కోనాంలో విలేఖరులకు తెలిపారు. ఈ కష్టాలు తమకు ఎన్నాళ్లు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-11-04T04:32:16+05:30 IST