ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల హక్కులు కాపాడాలి

ABN, First Publish Date - 2020-11-13T05:42:33+05:30

దివ్యాంగుల హక్కులు కాపాడే 2016 బిల్లును అమల్లోకి తేవాలని ఆలిండియా దివ్యాంగుల మహాసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు డిమాండ్‌ చేశారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వేదిక ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలిండియా దివ్యాంగుల మహాసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు 

డాబాగార్డెన్స్‌: దివ్యాంగుల హక్కులు కాపాడే 2016 బిల్లును అమల్లోకి తేవాలని ఆలిండియా దివ్యాంగుల మహాసేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమైక్య వేదిక (జేఏసీ) ఏర్పాటుచేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 పార్లమెంటు ఆమోదం పొందినా ఇప్పటికీ రాష్ట్రంలో అమల్లోకి రాకపోవడం దురదృష్టకరమన్నారు. బిల్లు అమలుకాక దివ్యాంగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఈనెల 26న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వి.రామస్వామి మాట్లాడుతూ తమ సమస్యల సాధన కోసం రిలే నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు డాక్టర్‌ సీతల్‌, అవినాష్‌, రవి, రాము, పూర్ణిమ, లక్ష్మి రామకృష్ణ  పాల్గొన్నారు.

  

 


Updated Date - 2020-11-13T05:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising