ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలవులో జిల్లా రిజిస్ట్రార్‌

ABN, First Publish Date - 2020-08-15T09:46:44+05:30

జిల్లాలో కొత్త భూముల రేట్లు ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ నెల పదో తేదీ నుంచి వీటిని అమలు చేయాల్సి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలులోకి రాని కొత్త భూముల ధరలు

సోమవారం నుంచి పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్లు


విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త భూముల రేట్లు ఇంకా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ నెల పదో తేదీ నుంచి వీటిని అమలు చేయాల్సి ఉంది. ప్రజలకు తెలిసేలా వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఈ పనులు ఇప్పటివరకు పూర్తి  కాలేదు. సబ్‌ రిజిస్ట్రార్లు వారి పరిధిలో పెరిగిన భూముల ధరలను అప్‌లోడ్‌ చేసి, జిల్లా రిజిస్ట్రార్‌కు లెటర్‌ పంపించాలి. అన్నీ సక్రమంగా చేశామని, పరిశీలించి వాటిని ఆమోదించాలని కోరాలి. ఆ తరువాత జిల్లా రిజిసా్ట్రర్‌ వాటిని చూసి సవ్యంగా ఉంటే ‘మేక్‌ ఎఫెక్ట్‌’ ఆమోద ముద్ర వేస్తారు. అప్పుడు అవి వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. అయితే సర్వర్‌ సమస్య వల్ల సబ్‌ రిజిస్ట్రార్లు అనుకున్న సమయంలో ఆ పనులు పూర్తి చేయలేకపోయారు. ఎట్టకేలకు శుక్రవారం నాటికి అంతా వారి పనులు పూర్తి చేసి, జిల్లా రిజిస్ట్రార్‌కు లెటర్లు పంపించేశారు. అయితే జిల్లా రిజిసా్ట్రర్‌ కె.మన్మఽథరావు ఆరోగ్యంగా సరిగా లేక సెలవు తీసుకున్నారు.


దీంతో ఆయన ఆమోద ముద్ర వేయలేకపోయారు. ఇన్‌చార్జిగా ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వారు ఆ పని పూర్తిచేస్తే తప్ప ప్రక్రియ పూర్తి కాదు. సోమవారం నాటికి ఇవన్నీ పూర్తయి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ప్రస్తుతం చాలా కార్యాలయాల్లో కరోనా ఎఫెక్ట్‌ వల్ల సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. ఓ మూడు కార్యాలయాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. వారి దగ్గర మాన్యువల్‌ బుక్‌లో వివరాలు ఉండటంతో ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు వస్తే వాటి ప్రకారం చేస్తున్నారు. ఏదేమైనా సోమవారం నుంచి అన్నీ సర్దుకుంటాయని అధికారులు చెబుతున్నారు.   

Updated Date - 2020-08-15T09:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising