ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీడీల కోసం దూరవిద్య విద్యార్థుల పడిగాపులు

ABN, First Publish Date - 2020-12-30T05:27:09+05:30

ఏయూ దూరవిద్య కేంద్రంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు ఈనెల 31తో గడువు ముగియనుండడంతో డీడీలు తీసేందుకు కేంద్రం ఆవరణలోని బ్యాంక్‌ వద్ద విద్యార్థులు బారులుతీరారు.

బ్యాంక్‌లో డీడీల తీసేందుకు క్యూలో వేచివున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు 29: ఏయూ దూరవిద్య కేంద్రంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు ఈనెల 31తో గడువు ముగియనుండడంతో డీడీలు తీసేందుకు కేంద్రం ఆవరణలోని బ్యాంక్‌ వద్ద విద్యార్థులు బారులుతీరారు. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఫీజు డీడీల కోసం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు గంటల తరబడి క్యూలో నిలిచారు. కొంతమంది మహిళలు పసిపాపలతో క్యూలో వేచివుండి డీడీలు తీశారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. కాగా డీడీలు తీసిన విద్యార్థులు వాటిని ఇచ్చేందుకు దూరవిద్య కేంద్రంలో భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. కాగా కరోనా దృష్ట్యా ఫీజు గడువును మరో 15 రోజులు పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-30T05:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising