ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూ అభివృద్ధి

ABN, First Publish Date - 2020-05-30T08:55:16+05:30

భోగాపురంలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల అభివృద్ధికి విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మంట్‌ అథారిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

5 మండలాలు,360 కిలోమీటర్లు

విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మంట్‌ అథారిటీ ప్రణాళిక

ఆర్‌పీఎఫ్‌కు ప్రకటన

రవాణా వ్యవస్థల అభివృద్ధి,

భౌతిక, సామాజిక వసతులు కల్పన,

పర్యాటక రంగ అభివృద్ధి దిశగా కార్యాచరణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురంలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల అభివృద్ధికి విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) నడుం కట్టింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మొత్తం ఐదు మండలాల్లో 360 కి.మీ. ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో ‘వ్యూహాత్మక వినూత్న ప్రణాళికలు’ సమర్పించాలంటూ నిపుణుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) ప్రకటన విడుదల చేసింది. 


గత పదిహేనేళ్లుగా విశాఖ నగరం ఉత్తర దిశగా అభివృద్ధి చెందుతోంది. మధురవాడ, ఆనందపురం, భీమిలి, తగరపువలస...అలా భోగాపురం వరకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వెంచర్లు వేసుకుంటూ వెళుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్‌ గ్రూపునకు అప్పగించారు. మూడేళ్లలో దానిని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ పరిసరాలను భవిష్య అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి వీఎంఆర్‌డీఏ ముందుకువచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే విశాఖ నుంచి భోగాపురం వరకు 140 కి.మీ. పొడవున మెట్రో రైలు వేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. దీనిని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.


మరోవైపు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చాలని ప్రయత్నిస్తోంది. ఆ కార్యాలయాలు కూడా భీమిలి నియోజకవర్గంలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని వీఎంఆర్‌డీఏ భావిస్తోంది. విశాఖ నుంచి 45 కి.మీ., విజయనగరం నుంచి 25 కి.మీ. దూరంలో భోగాపురం ఉంది. విజయనగరం జిల్లాలో భోగాపురం, డెంకాడ, విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం, భీమిలి, విశాఖపట్నం రూరల్‌ మండలాల్లో మొత్తం 59 గ్రామాల్లో 360 కి.మీ. ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి యోచిస్తున్నారు.


ఏ విధంగా అంటే...?

విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు నెట్‌వర్క్‌ మెరుగుపరచడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం దీని ఉద్దేశం. ఇందుకోసం ఆ మార్గంలో పెరగబోయే ట్రాఫిక్‌ను అంచనా వేయడం, రవాణా వ్యవస్థలు అభివృద్ధి చేయడం, భౌతిక, సామాజిక వసతులు కల్పించడం, భవిష్య అవసరాల మేరకు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం కోసం ఇప్పుడు నిపుణుల సలహాలు కోరుతున్నారు. 


భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో 31 కి.మీ. కొండ ప్రాంతం, 40 కి.మీ. తీరప్రాంతం ఉన్నాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రణాళిక సమర్పించేవారు ముందుగా ఆ ప్రాంతంలో ఓ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవడం, డేటా సేకరణ, బేస్‌ మ్యాపింగ్‌ చేయడం, ప్రస్తుతం అక్కడ వున్నవాటిని ప్రణాళికలో చేర్చడం, దూరదృష్టితో వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించడం వంటి పనులు చేయాల్సి వుంటుందని వీఎంఆర్‌డీఏ పేర్కొంది. జూన్‌ 5వ తేదీలోపు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.

Updated Date - 2020-05-30T08:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising