ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగాపురంలో యువకుడి నిర్బంధం

ABN, First Publish Date - 2020-12-12T04:50:16+05:30

మండలంలోని భోగాపురం గ్రామంలో ఓ యువకుడ్ని శుక్రవారం గ్రామస్థులు నిర్బంధించి చితకబాదడం వివాదాస్పదంగా మారింది.

భోగాపురం గ్రామస్థుల చెరలో ఉన్న అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకలు కాల్చేస్తున్నాడన్న అనుమానంతో కట్టేసి చితకబాదిన గ్రామస్థులు

స్థానికుల చెర నుంచి విడిపించి చికిత్స అందించిన పోలీసులు


చోడవరం, డిసెంబరు 11: మండలంలోని భోగాపురం గ్రామంలో ఓ యువకుడ్ని శుక్రవారం గ్రామస్థులు నిర్బంధించి చితకబాదడం వివాదాస్పదంగా మారింది. ఈ గ్రామంలో ఇటీవల కొంత మంది పశువుల పాకలు, ద్విచక్ర వాహనాలు తగులబడ్డాయి. ఈ ఘటనకు కారకుడిగా అనుమానిస్తూ గ్రామానికి చెందిన పొలిమేర అప్పలరాజుపై స్థానికులు నిఘా ఉంచారు. అతనే దీనికి కారకుడిగా నిర్ధారించి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు అరెస్టు చేశారు. ఇటీవల అప్పలరాజు బెయిలుపై విడుదలై గ్రామంలోనే తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో మరో పశువుల పాక దగ్ధమైంది. దీంతో కోపోద్రోక్తులైన గ్రామస్థులు శుక్రవారం ఉదయం అప్పలరాజును నిర్బంధించి దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వెళ్లి అప్పలరాజును విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. 


Updated Date - 2020-12-12T04:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising