డిప్యూటీ డీఈవో ఆకస్మిక తనిఖీ
ABN, First Publish Date - 2020-11-04T02:06:39+05:30
పాఠశాలల్లో కరోనా నియంత్రణపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ డిప్యూటీ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌ను ఆయన మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సబ్బవరం హైస్కూల్ సందర్శన
కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా
సబ్బవరం, నవంబరు 3 : పాఠశాలల్లో కరోనా నియంత్రణపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ డిప్యూటీ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌ను ఆయన మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులు తీసుకుంటున్న జాగ్రత్తలు, పాఠ్యాంశాల బోధన జరుగుతున్న విధానం గురించి ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. థర్మల్ స్ర్కీనింగ్ తో విద్యార్థులను రోజూ పరీక్షించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. బయో మెట్రిక్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం ఎస్.అప్పలరాజు, ఉపాధ్యాయులు డి.శ్రీనివాస్, పి.ప్రసాద్, ఉదయశేఖర్, ఎన్.శ్రీనివాస్, డి.సురేశ్ ఉన్నారు.
Updated Date - 2020-11-04T02:06:39+05:30 IST