ఎట్టకేలకు బాణసంచా విక్రయాలు
ABN, First Publish Date - 2020-11-14T04:48:56+05:30
బాణసంచా విక్రయాలకు ఎట్టకేలకు పోలీసుల నుంచి అనుమతి లభించింది.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసు అధికారులు
నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే వ్యాపారాలు
కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశం
నర్సీపట్నం టౌన్, నవంబరు 13 : బాణసంచా విక్రయాలకు ఎట్టకేలకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. పట్టణ శివారు పెద్ద చెరువు సమీపంలో మందుగుండు సామగ్రి దుకా ణాల ఏర్పాటుకు అగ్నిమాపక, మునిసిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు 25 మందికి అనుమతులు మంజూరు చేశారు. శనివారం ఒక్కరోజే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు. అగ్ని మాపక శాఖ సూచనల మేరకు ఇసుక మూటలు, డ్రమ్ములతో నీరు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. దుకాణాల మధ్య పది అడుగుల దూరం ఉండాలని, దుకాణాలకు వచ్చేవారు విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
Updated Date - 2020-11-14T04:48:56+05:30 IST