ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి

ABN, First Publish Date - 2020-11-13T06:03:15+05:30

టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జె.వి.సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్‌ 

అల్లిపురం, నవంబరు 12: టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. లేదంటే ఈనెల 16వ తేదీన తామే లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు. అల్లిపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30వ తేదీన జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


కేంద్రప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ఈనెల 26వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, కార్యవర్గ సభ్యుడు ఎం.పైడిరాజు, ఎ.విమల, ఎం.రాజబాబు, సమితి సభ్యులు, మండల కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-13T06:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising