ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ జిల్లాలో వైరస్‌ విజృంభణ.. 11 రోజుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

ABN, First Publish Date - 2020-08-12T13:30:51+05:30

జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 19న నమోదైంది. జూలై 31 వరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11 రోజులు.. 10,024 కేసులు!

సగటున గంటకు 39 మంది...

మొత్తం కొవిడ్‌ మరణాలు 144

అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణుల సూచన


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు మార్చి 19న నమోదైంది. జూలై 31 వరకు అంటే 135 రోజుల్లో 11,177 కేసులు నమోదు కాగా, ఆగస్టు నెల పదకొండు రోజుల్లోనే 10,024 వచ్చాయి. ఈ నెల ఒకటో తేదీన 1155 మంది, 2న రికార్డు స్థాయిలో 1,227 మంది, 3న 1049 మందికి వైరస్‌ సోకింది. జిల్లాలో గంటకు సగటున 39 మంది వైరస్‌ బారినపడుతున్నారు. ఇవి పరీక్షలు చేయగా నిర్ధారణ అవుతున్న కేసులని, పరీక్షలు చేయించుకోకుండా చాలామంది వైరస్‌ బారినపడి బయటే ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


అంతేస్థాయిలో మరణాలు

కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో వైరస్‌ బారినపడి 144 మంది మృతిచెందగా, ఇందులో ఆగస్టు నెలలోనే 58 మంది మృతిచెందారు. 


ఇదీ లెక్క.. 

తేదీ నమోదైన కేసులు మరణాలు

1    1155 8

2    1227 4

3    1049 3

4     863 5

5     842 6

6     781 4

7     852 5

8     998 5

9     961 6

10     620 5

11    676 7

10,024 58


Updated Date - 2020-08-12T13:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising