ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరకు ఎంపీ స్వగ్రామంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-08-12T13:10:30+05:30

అరకు ఎంపీ మాధవి స్వగ్రామమైన శరభన్నపాలెంలో కరోనా కలకలం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో నలుగురి నిర్ధారణ

గ్రామంలో తొమ్మిదికి చేరిన పాజిటివ్‌లు


కొయ్యూరు(విశాఖపట్నం): అరకు ఎంపీ మాధవి స్వగ్రామమైన శరభన్నపాలెంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకేరోజు ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం.. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో మరో నాలుగు కేసులు వెలుగు చూడడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో జూలై 28న ఒక వివాహ వేడుకను నిర్వహించి విందు ఏర్పాటు చేసిన కుటుంబానికి చెందిన నలుగురితోపాటు గ్రామానికి చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌ సోమవారం నిర్ధారణ అయ్యింది.


దీంతో ఎంపీ మాధవి స్పందించి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవోల మాట్లాడి మంగళవారం గ్రామంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పరీక్షించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ మాధవి మాట్లాడుతూ.. కరోనా విషయమై ప్రజలు ఆందోళనకు గురికావద్దని, బాధితుల పట్ల వివక్ష చూపవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త శివప్రసాద్‌, వైద్యాధికారిణి ప్రణతి, ఎల్‌టీ బాబూరావు, ఏఎన్‌ఎం చెల్లయ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-12T13:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising