ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల మార్కెట్‌ నిర్మాణానికి ప్రణాళిక

ABN, First Publish Date - 2020-11-26T05:30:00+05:30

భీమిలిలోని మునిసిపల్‌ లల్‌బహుదూర్‌శాస్త్రి చేపల మార్కెట్‌ పాడైపోయినందున నూతనముగా అన్ని సదుపాయాలతో నిర్మించడానికి ప్రణాళికను రూపొందించవలసిందిగా సూపరింటెండెంట్‌ ఇంజనీరును జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఆదేశించారు.

చేపల మార్కెట్‌లో అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులను ఆదేశించిన జీవీఎంసీ కమిషనర్‌ సృజన

భీమునిపట్నం, నవంబరు 26: భీమిలిలోని మునిసిపల్‌ లల్‌బహుదూర్‌శాస్త్రి చేపల మార్కెట్‌ పాడైపోయినందున నూతనముగా అన్ని సదుపాయాలతో నిర్మించడానికి ప్రణాళికను రూపొందించవలసిందిగా సూపరింటెండెంట్‌ ఇంజనీరును జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఆదేశించారు. గురువారం ఆమె భీమిలిలో ఆకస్మికంగా పర్యటించారు. చేపల మార్కెట్‌ను ఆనుకుని మెయిన్‌రోడ్డులోని మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను సందర్శించి దుకాణాలన్నీ శిథిలావస్థకు చేరినందున వీటిని కూడా కొత్తగా నిర్మించడానికి తగిన ప్లాన్‌ రూపొందించాలన్నారు. అనంతరం జీవీఎంసీ హైస్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించి, టాయిలెట్లను మరింత మెరుగైన నిర్మించాలని సూచించారు. 


ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టిసారించండి

వార్డు సచివాలయ పరిధిలో వున్న ఆస్తి పన్ను వసూళ్లపై సిబ్బంది దృష్టిపెట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ సృజన ఆదేశించారు. అప్పికొండ వీధి సచివాలయాన్ని సందర్శించిన ఆమె కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ పరిధిలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఆస్తి పన్ను వసూళ్లపై ఆరా తీసి పలు సూచనలిచ్చారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-11-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising