ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమోనియం నైట్రేట్‌పై కలెక్టర్‌ స్పందించాలి’

ABN, First Publish Date - 2020-08-07T10:17:50+05:30

ప్రమాదకరమైన అమోనియం నైట్రేట్‌ నిల్వలపై జిల్లా కలెక్టర్‌, విశాఖపట్నం పోర్టు అధికారులు స్పష్టమైన ప్రకటన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రమాదకరమైన అమోనియం నైట్రేట్‌ నిల్వలపై జిల్లా కలెక్టర్‌, విశాఖపట్నం పోర్టు అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం, పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. బీరుట్‌ ప్రమాదంపై ప్రపంచమంతా దిగ్ర్భాంతికి గురైందని, అలాంటి పరిస్థితులే విశాఖలో ఉన్నాయని సీపీం నాయకులు నర్సింగరావు, లోకనాథం, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామమూర్తి ఆరోపించారు.


విశాఖపట్నం పోర్టుకు ఏటా 2.5 లక్షల టన్నుల అమోనియం నైట్రేట్‌ దిగుమతి అవుతున్నదని, దీనిని నగరంలోని ఆరు ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారన్నారు. వీటిలో కొన్ని గోదాములు హెచ్‌పీసీఎల్‌కు దగ్గరగా ఉన్నాయని, అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నందున దీనిపై కలెక్టర్‌ వినయ్‌చంద్‌ స్పందించాలని కోరారు. మరోవైపు మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కూడా విశాఖ పోర్టులో అమోనియం నైట్రేట్‌ నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర హోమ్‌ శాఖకు తాజాగా లేఖ రాశారు. 

Updated Date - 2020-08-07T10:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising