చిచ్చరపిడుగులు
ABN, First Publish Date - 2020-12-15T06:34:41+05:30
వరల్డ్ ఫిడే కేడెట్, యూత్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎం.సాహితి వర్షిణి, బి.కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్ ప్రసాద్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
ప్రపంచ చెస్ టోర్నీలో సత్తా చాటిన విశాఖ చిన్నారులు
విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 14: వరల్డ్ ఫిడే కేడెట్, యూత్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎం.సాహితి వర్షిణి, బి.కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్ ప్రసాద్ అద్భుత ప్రతిభ కనబరిచారు. సోమవారం ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. బాలికల అండర్-14 విభాగంలో ఎం.సాహితి వర్షిణి నాల్గవ స్థానం, అండర్-18 కేటగిరీలో బి.కల్యాణి తొమ్మిదో స్థానం, అండర్-10 విభాగంలో దేవకి నందన 19వ స్థానం, అలన మీనాక్షి 20వ స్థానాలు సాధించారు. బాలుర అండర్-10 విభాగంలో అఖిల్ ప్రసాద్ 34వ స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచ స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొని ఉన్నత స్థానాలను సాధించిన చిన్నారులను విశాఖ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఆనందకుమార్, పి.సుబ్బారెడ్డి, ఇతర ప్రతినిధులు అభినందించారు.
Updated Date - 2020-12-15T06:34:41+05:30 IST