రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ
ABN, First Publish Date - 2020-12-16T05:00:18+05:30
రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
మునగపాకలో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న రైతులు
మునగపాక, డిసెంబరు 15: రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. సంతబయలు నుంచి పంచాయతీ కార్యాలయం వరకు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబరు 22ను రద్దుచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆళ్ల మహేశ్వరరావు, ఎస్.బ్రహ్మాజీ, డొప్పా రమణ, టెక్కలి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T05:00:18+05:30 IST