ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేవీ రక్తదాన శిబిరానికి విశేష స్పందన

ABN, First Publish Date - 2020-11-30T04:58:37+05:30

నేవీ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం భీమిలి ఐఎన్‌ఎస్‌ కళింగ నేవల్‌ స్టేషన్‌లో నిర్వహించిన ర క్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

రక్తదానం చేస్తున్న నేవల్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం, నవంబరు 29: నేవీ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం భీమిలి ఐఎన్‌ఎస్‌ కళింగ నేవల్‌ స్టేషన్‌లో నిర్వహించిన ర క్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని నేవల్‌ సర్జన్‌ రియర్‌ అడ్మిరల్‌, కమాండ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సీఎస్‌ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణం నగరంలోని బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గిన నేపథ్యంలో నేవీ వారోత్సవాల్లో భాగంగా నేవల్‌ డాక్‌యార్డు, ఐఎన్‌ఎస్‌ విశ్వకర్మ, ఐఎన్‌ఎస్‌ డేగాలలో ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కళింగ నేవల్‌ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరానికి ఏఎస్‌ రాజా బ్లడ్‌బ్యాంక్‌ అధికారులు సహకారం అందించారన్నారు. ఈ శిబిరంలో 204 మంది రక్తదానం చేసినట్టు సీఎస్‌ నాయకుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-11-30T04:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising