ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారుల అధ్వాన స్థితిపై బీజేపీ నిరసన

ABN, First Publish Date - 2020-12-06T04:06:32+05:30

రోడ్లు అధ్వానంగా తయారైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నాయకులు శనివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

గాజువాక డిపో ప్రధాన రహదారిలో ఆందోళన చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, డిసెంబరు 5 : మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా తయారైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నాయకులు శనివారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డి రామానాయుడు, జిల్లా కార్యదర్శి వనం సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి రాజధాని ఊహాల్లో తేలియాడుతూ కాలక్షేపం చేస్తోందని  విమర్శించారు. సబ్బవరంలో నారపాడు రోడ్డు, ఆదిరెడ్డిపాలెం రోడ్డు, పాతరోడ్డు-గుల్లేపల్లి రోడ్డు, కొత్తరోడ్డు-తవ్వానిపాలెం రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నా యన్నారు. తక్షణమే వాటికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్‌ కోన మంగయ్య, మండల అధ్యక్షుడు గొర్లి సత్యప్రసాద్‌, ఎస్సీ మోర్చా కార్యదర్శి గొటివాడ సామ్రాట్‌కుమార్‌, ఆకాశ్‌, గొంప నర్శింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 


గోపాలపట్నంలో..

గోపాలపట్నం: అధ్వానంగా ఉన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ బి.స్వామినాయుడు ఆధ్వర్యంలో గోపాలపట్నంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలపట్నం బంక్‌ కూడలి నుంచి బుచ్చిరాజుపాలెం వరకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రహదారుల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని, వెంటనే రహదారుల మరమ్మతులకు, రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ చర్యలు చేపట్టాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.


పారిశ్రామిక ప్రాంతంలో..

శ్రీహరిపురం: పారిశ్రామిక ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని కోరుతూ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొలిమేర శ్రీను, ములకపల్లి ప్రకాశ్‌, పోలిమేర గోవింద్‌, మద్దాల రాజు, ఈశ్వరరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising