ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి

ABN, First Publish Date - 2020-12-12T04:58:01+05:30

ఉద్యాన సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభించడం ద్వారానే ఉద్యాన రైతులు అధిక దిగుబడులు సాధించగలరని జిల్లా ఉద్యాన సహాయ సంచాలకులు కె.శైలజ అన్నారు.

మాట్లాడుతున్న కె.శైలజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, డిసెంబరు 11 : ఉద్యాన సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభించడం ద్వారానే ఉద్యాన రైతులు అధిక దిగుబడులు సాధించగలరని జిల్లా ఉద్యాన సహాయ సంచాలకులు కె.శైలజ అన్నారు. మండలంలోని దేవీపురంలో శుక్రవారం ఉద్యానాధికారి జి.రాధిక వైఎస్సార్‌ తోటబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ బిందు సేద్యం, మల్చింగ్‌ షీట్‌ వినియోగం, ట్రెల్లీలు, పందిర్ల నిర్మాణం వంటి ఆధునిక ఉద్యాన పద్ధతులను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకులు లోవరాజు, సత్యవతమ్మ, భీశెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

పొలంబడితో అధిక దిగుబడులు

పరవాడ: పొలంబడితో రైతులు తక్కువ ఖర్చుతో అధిక  దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్‌.కోటేశ్వరరావు తెలిపారు. తానాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పొలంబడి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ 14 వారాల పాటు పొలంబడి గురించి రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా పలు సలహాలు, సూచనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి చంద్రవతి, ఏఈవోలు సంజీవరావు, వరలక్ష్మి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ జ్యోతి, సుందరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising