ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను మోసం చేసింది మీరు కాదా..!

ABN, First Publish Date - 2020-12-18T05:03:11+05:30

ప్రజలకు మాయ మాటలు చెప్పి, మోసం చేసింది మీరేనని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే గణేశ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం

నర్సీపట్నం, డిసెంబరు 17 : ప్రజలకు మాయ మాటలు చెప్పి, మోసం చేసింది మీరేనని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. గురువారం ఆయన స్థానిక విలేఖరులకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము ఎమ్మెల్యేకు లేదన్నారు. ఏపీ టిడ్కో ఇళ్లు టీడీపీ హయాంలో 80 శాతం పూర్తి చేస్తే, అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము నిర్మించిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుంటున్నారని విమర్శించారు. బలిఘట్టం సత్యదేవుని ఆలయం వద్ద కల్యాణ మండపం 80శాతం పనులు పూర్తి చేస్తే, మిగిలిన 20శాతం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నారు. బలిఘట్టం- ధర్మసాగరం రోడ్డు, శారదానగర్‌ భూగర్భ డ్రైనేజీ, వెంకటేశ్వరస్వామి గుడి రోడ్డు నుంచి పెద్దబొడ్డేపల్లి వరకు రోడ్డు, కోటవురట్ల మండలం జల్లూరు వంతెన పనులు టీడీపీ ప్రభుత్వంలో 90శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10శాతం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. కృష్ణాదేవిపేటలో ఎమ్మెల్యే అనుచరుడు, వైసీపీ నాయకుడు తప్పుడు పట్టాదారు పుస్తకాలతో రూ.13కోట్లు బ్యాంకు దోపిడీ చేశారని, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

Updated Date - 2020-12-18T05:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising