ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఎంఆర్‌డీఏ నిధులు రూ.24 కోట్లు మింగేశారు

ABN, First Publish Date - 2020-10-25T10:32:56+05:30

శాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)లో రూ.24 కోట్ల నిధులు అంతా కలిసి మింగేశారని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులపై అయ్యన్న ఆరోపణలు


విశాఖపట్నం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)లో రూ.24 కోట్ల నిధులు అంతా కలిసి మింగేశారని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పేదలకు ఇళ్లు పేరుతో 1,200 ఎకరాలను వీఎంఆర్‌డీఏ నిధులతో చదును చేయించారని, కానీ ఎక్కడా పనులు సవ్యంగా జరగలేదన్నారు. కనీసం మట్టి కూడా సరిగ్గా వేయలేదన్నారు. శ్మశానాలు, చెరువులు, గోతుల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. వీఎంఆర్‌డీఏ నిధులు అంటే... ప్రజల డబ్బు అని, తాను దీనిపై గతంలో ఆరోపణలు చేస్తే.. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు గాని, మంత్రి బొత్స సత్యనారాయణ గాని, వైసీపీ నాయకులు గానీ దీనిని ఖండించడం లేదన్నారు. అంటే.. అంతా కలిసి గూడుపుఠాణీ చేసి రూ.24 కోట్లు తినేశారని అర్థమవుతోందన్నారు. ఇలా ఎన్ని రకాలుగా విశాఖపట్నాన్ని దోచేయవచ్చో అన్ని రకాలుగా చేస్తున్నారని, దీనికి ఐఏఎస్‌ అధికారులే సహకరిస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2020-10-25T10:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising