ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

ABN, First Publish Date - 2020-12-15T06:17:53+05:30

క్రీడలతోనే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని ఏయూ వైస్‌ చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు.

అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ వైస్‌ చాన్సలర్‌ ప్రసాద్‌రెడ్డి


కొత్తూరు, డిసెంబరు 14: క్రీడలతోనే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని ఏయూ వైస్‌ చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏఎంఏఎల్‌ కళాశాల అవుట్‌డోర్‌ స్టేడియం వద్ద సోమవారం 400 మీటర్ల రన్నింగ్‌ 9లేన్‌ ట్రాక్‌ను ప్రారంభించారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతీ రోజూ వ్యాయామం చేయాలన్నారు. ఇంటర్నెట్‌లో ఎక్కువ సమయం గడిపితే మెదడుకు ఉన్న ఆకర్షణ శక్తి బలహీనపడిపోతుందన్నారు. ఏయూ లేని సదుపాయాలను ఏఎంఏఎల్‌ కళాశాలలో ఏర్పాటు చేయడంపై అభినందించారు. కార్యక్రమంలో వర్తక సంఘం ప్రతినిధులు కొణతాల లక్ష్మీనారాయణ, తమ్మన రఘుబాబు, కళాశాల కరస్పాండెంట్‌ దాడి శ్రీనివాసరావు, అధ్యక్షుడు కె.మంగరాజు, ఉపాధ్యక్షుడు కె.నారాయణరావు, కోశాధికారి కె.సన్యాసినాయుడు, ఏయూ పీడీ ఎన్‌.విజయమోహన్‌, డీన్‌ సిహెచ్‌.పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T06:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising