ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-11-25T05:51:43+05:30

ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.ఐదు లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తిని మంగళవారం ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు కిలపర్తి సందర్శ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంవీపీ కాలనీ, నవంబరు 24: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.ఐదు లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తిని మంగళవారం ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ భాస్కరరావు కథనం ప్రకారం కిలపర్తి సందర్శ అనే వ్యక్తి శివాజీపాలెంలోని ఎన్‌.కనకమహాలక్ష్మి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటూ తాను గతంలో నేవీలో పనిచేసి బుల్లెట్‌ గాయం వల్ల రాజీనామా చేసినట్టు నమ్మబలికాడు. తన తరపున ఒకరికి నేవీలో ఉద్యోగమిస్తారని, ఆ జాబ్‌ను కనకమహాలక్ష్మి కొడుక్కి ఇప్పిస్తానని చెప్పి సందర్శ రూ.ఐదు లక్షలు వసూలు చేశాడన్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా, తాను ఉంటున్న ఇంటిని వారం రోజుల కిందట ఖాళీ చేసి సందర్శ పరారయ్యాడన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో సందర్శను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2020-11-25T05:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising